ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డ్ షాక్ ఇస్తోంది. గతంలో పరీక్షలు క్యాన్సిల్, ఆల్ పాస్ అని చెప్పిన అధికారులు, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కదా పరీక్షలు రాయండి అంటూ మెలికపెడుతున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తుది అనుమతి రాగానే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తుందని అంటున్నారు.