టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు మచిలీపట్నంలో నడకుదిటి నర్సింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు. అంతే కాకుండా కరోనా కాలంలో చనిపోయిన పార్టీ కార్యకర్తల చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ...టీడీపీ అధికారంలో ఉండి ఉంటే కరోనాని కట్టడి చేసేవాళ్ళమని చెప్పారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని...జగన్ ఖజానా మాత్రం గళ గళ లాడుతోందని చంద్రబాబు అన్నారు.