ఏపీలో జనసేన పార్టీకి భవిష్యత్ పెద్దగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీని పెద్దగా బలోపేతం చేస్తున్నట్లు లేరు. గత ఎన్నికల దగ్గర నుంచి పార్టీని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పవన్ పని చేయలేదు. ఎప్పటిలాగానే పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తూ ముందుకెళుతున్నారు. దీంతో ఏపీలో పార్టీకి భవిష్యత్ ఉండదా? అనే అనుమానం సొంత పార్టీ కార్యకర్తల్లోనే మొదలైంది.