రాజకీయాల్లో దూకుడుగా ఉండకపోయినా.. సమయానికి తగిన విధంగా ప్రజల సమస్యలపై స్పందించడం అనేది ఏ నేతకైనా అవసరం. అయితే.. ఈ విషయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విఫలమవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈయన వరుసగా మూడు పార్టీలు మారినా.. ప్రజలు ఆయనను గెలిపించారు. గతంలో కాంగ్రెస్లో తర్వాత.. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ క్రమంలో ప్రజలకు చేరువ అయ్యారు. చంద్రబాబును ఒప్పించి.. జిల్లా అభివృద్ధికి, నియోజకవర్గం అభివృద్ధికి కూడా నిధులు తెచ్చారు. అదేసమయంలో తన వర్గం వారికి చేదోడుగా ఉన్నారు.