ఎట్టకేలకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల మధ్య లోకి వచ్చారు. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైన చంద్రబాబు, తాజాగా ఏపీలో వరుసగా పర్యటిస్తున్నారు. వరుస పెట్టి టీడీపీ నేతల్ని పరామర్శించే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక షాకింగ్ విషయం బయటపడింది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజల మద్ధతు ఇవ్వని విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనకు ప్రజల మద్ధతు పెద్ద ఎత్తున దక్కడం లేదు. పైగా కరోనా నేపథ్యంలో ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా నారా లోకేష్‌నే పంపిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇంకా జనాలకు మరింత దూరమయ్యారని తెలుస్తోంది.