ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు 22 మంది ఎంపీల బలం ఉందని సంగతి తెలిసిందే. గత ఎన్నికల ముందు జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి, ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. అయితే కేంద్రంలో బీజేపీ మళ్ళీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో జగన్కు కేంద్రం మెడలు వంచి హోదా తీసుకురాలేకపోయారు. అలా అని వైసీపీ తరుపున గెలిచిన ఎంపీలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలకు పోరాడుతున్నట్లు కనిపించడం లేదు. కానీ కొంతమంది మాత్రం ప్రజల్లో తిరుగుతూ, ప్రజలకు అండగా నిలబడుతున్నారు.