కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది కేంద్రం. అన్ లాక్ అమలులోకి వచ్చాక వివిధ పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పోటెత్తడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా తప్పుబట్టారు. ఆందోళన కలిగించే అంశంగా దాన్ని అభివర్ణించారు. అయితే ఇదే సమయంలో యూపీ సీఎం యోగి మాత్రం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'కాంవడ్' యాత్రకు అనుమతిచ్చి కలకలం రేపారు.