తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లలలో మరో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో ఐటీ, అనుబంధ సంస్థలకు గిరాకీ పెరగుతున్నందున హైదరాబాద్ పరిసరాల్లో ఐటీ హబ్ సిద్ధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. మరి ఈ కొత్త హైటెక్ సిటీ ఎక్కడ వస్తుందో తెలుసా.. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి పరిసర ప్రాంతాల్లో రాబోతోంది.