వైసీపీ ప్రభుత్వానికి రెండేళ్ళు సమయం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే, పిఏసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు. రాష్ట్రం చేస్తున్న ఖర్చులపై సమీక్ష చేయడానికి, ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు సంబంధించిన లెక్కలు అడగటానికి పిఏసి ఛైర్మన్‌కు అధికారాలు ఉంటాయి. అందుకే గత రెండేళ్ళు వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చుల లెక్కలని, అప్పులని పయ్యావుల బయటపెడుతున్నారు.