పవన్ కల్యాణ్....సినిమాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. ఇక ఈయనకు రాజకీయాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈయన రోడ్డు మీదకు వస్తే వేలాది మంది జనం వస్తారు. కానీ పవన్ కోసం వచ్చినవారంతా, జనసేనకు ఓటు వేయరు. ఆ విషయం గత ఎన్నికల్లోనే రుజువైంది. గత ఎన్నికల ముందు పవన్ ఎక్కడ సభ పెడితే, అక్కడికి జనం భారీ ఎత్తున వచ్చేవారు. దీంతో జనసేనకు భారీగానే ఓట్లు పడతాయని అంతా అనుకున్నారు.