రేవంత్ రెడ్డి...తెలంగాణ రాజకీయాల్లో మాస్ నాయకుడు అని చెప్పొచ్చు. ఈయన దూకుడుకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. మొదట నుంచి దూకుడుగా రాజకీయాలు చేస్తూ నాయకుడుగా ఎదుగుతూ వచ్చిన రేవంత్‌కు, ఆ రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీలో ఉన్నప్పుడే రేవంత్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉండేది. అలాగే కాంగ్రెస్‌లోకి వచ్చాక కూడా రేవంత్ క్రేజ్ తగ్గలేదు. అసలు చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ నాయకుడుకు లేని ఫాలోయింగ్ రేవంత్ రెడ్డికి ఉందని చెప్పొచ్చు.