ఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న జల వివాదంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చింది. రెండు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్ట్ లపై పెత్తనం బోర్డులదేనని తేల్చి చెప్పింది. అంటే ఇకపై రెండు రాష్ట్రాల్లో ఎవరికి వారే విడివిడిగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ లతోపాటు, ఉమ్మడి ప్రాజెక్ట్ లైన శ్రీశైలం, నాగార్జున సాగర్ పై కూడా పెత్తనం బోర్డులకే దఖలు పడుతుంది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 14నుంచి ఇది అమలులోకి వస్తుంది.