హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే అది కచ్చితంగా ఈటలపై కేసీఆర్ తీర్చుకున్న రివేంజ్ అని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పథకాలకు దక్కుతున్న ఆదరణ అని నిరూపితం అవుతుంది. బీజేపీది బలుపు కాదని, కేవలం దుబ్బాక విజయం వాపు మాత్రమేనని కూడా రుజువవుతుంది. మరి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే.., పరిస్థితులు అనుకూలించక కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి ఈటల చేతులో చిత్తు చిత్తు అయితే.., అప్పుడు జరిగే ప్రచారం ఏంటి..? ఎవరిని బలిపశువుని చేస్తారు. మొదటి నుంచి హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టిన మరో బీసీ మంత్రి గంగుల కమలాకర్ పైకి ఆ నెపం నెట్టేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.