మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలం కోయగూడెం గ్రామంలో లో సిగ్నల్ సరిగ్గా లేక విద్యార్థులు ఊరిబయట ఉన్న సమాధుల వద్ద కూర్చుంటున్నారు. అక్కడ సిగ్నల్ బాగా ఉండటంతో అక్కడే కూర్చుని క్లాసులు వింటున్నారు. వినడానికి భయంగా ఉన్నా ఇదే నిజం. కోయగూడెం గ్రామంలో సిగ్నల్ సమస్య దారుణంగా ఉంది. ఏ నెట్వర్క్ అయినా సిగ్నల్ మాత్రం సరిగా ఉండటం లేదు.