ఒక దెబ్బకు రెండు పిట్టలు ఇదే ఇప్పుడు కొత్తగా టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వ్యూహం. కొన్నిరోజుల ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం నడిచిన విషయం తెలిసిందే. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అసలు టీఆర్ఎస్కు బీజేపీనే అసలైన ప్రత్యర్ధి అని విశ్లేషణలు వచ్చాయి.