తెలుగుదేశం పార్టీకి 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయకుండా ఉంటే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని టీడీపీలో కొందరు నేతలు మాట్లాడుతున్నారు. అసలు పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత టీడీపీకి 2014లో అధికారం చేజిక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోవడంతో ఏపీలో చంద్రబాబుకు సీఎం అయ్యే అవకాశం దక్కింది.