ఏపీలో అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ నిత్యం ఏదొక అంశంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే పలు అంశాల్లో టీడీపీ పోరాటాలు కూడా చేస్తూ వచ్చింది. కానీ కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. కరోనా కంటే ముందు, పవన్ కల్యాణ్ ఇసుక అంశంలో వైజాగ్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అలాగే అమరావతి కోసం టీడీపీ సైతం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది.