ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. సలహాదారుగా ఉన్న సజ్జల రాజకీయ పరమైన అంశాల్లో కూడా జోక్యం చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ బయటకు రాకుండా అన్నీ విషయాలు సజ్జల ద్వారా నడిపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హోమ్ శాఖ ఈయన చేతిల్లోనే ఉందని, అందుకే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెరిగాయని అంటున్నారు.