చంద్రబాబు పని అయిపోయింది, లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా లేదు...కాబట్టి టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలి. ఇప్పుడు ఇదే అంశం తెలుగుదేశం పార్టీలో బాగా హైలైట్ అవుతుంది. తెలంగాణలో ఎలాగో పార్టీ పని అయిపోయింది. ఇక కాస్త బలం ఉన్న ఏపీలో పార్టీని నిలబెట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని పార్టీలో ఉండే కార్యకర్తలు, జూనియర్ అభిమానులు గట్టిగానే కోరుకుంటున్నారు.