కరోనా థర్డ్ వేవ్‌ను ఆపాలన్నా.. దాని ఉధృతి తగ్గించాలన్నా.. కొన్ని మార్గాలు సూచిస్తున్నారు. అవేంటంటే.. సూపర్ స్ప్రెడర్ ఘటనలను నివారించాలి. ఇతర కరోనా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. కరోనా మార్గదర్శకాలను, ఆంక్షలను ముందస్తుగా రాష్ట్రాలు ఎత్తివేస్తే.. అది మళ్లీ కేసుల పెరుగుదలకు దారితీస్తుంది. అందుకే కరోనా థర్డ్ వేవ్ ఆపాలంటే మరోసారి తక్కువ స్థాయి ఆంక్షలైనా అమలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.