జాబ్ క్యాలెండర్ అనేది ఏపీలో సంచలనంగా మారింది. అప్పటికీ వాలంటీర్లు, సచివాలయాల పోస్ట్ లతో వైసీపీ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసింది కానీ, జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా ఏపీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలను మరీ తక్కువ చేసి చూపించడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వీరికి విద్యార్థి సంఘాలు జతకావడంతో నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. వీరికి నాయకత్వం వహించడానికి లోకేష్, పవన్ కల్యాణ్ పోటీ పడుతున్నారు.