గ్రామాల్లో ఇంటిపన్ను ఇప్పటికే వసూలు చేస్తున్నారు. అయితే అది నామమాత్రంగానే ఉంటుంది. అందులోనూ కొత్తగా కట్టిన ఇళ్లకు పన్ను వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది, రాజకీయ ఒత్తిళ్లు ఉండనే ఉంటాయి. ఇకపై ఇలాంటివాటికి చెక్ పెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉండకుండా నిక్కచ్చిగా గ్రామాల్లో ఆస్తి పన్ను వసూలు చేయాలని చూస్తున్నారు అధికారులు.