తీవ్రవాదులకు తాము వ్యతిరేకమని పైకి కబుర్లు చెప్పే పాకిస్తాన్.. అఫ్గానిస్థాన్లో సైన్యం, తాలిబన్ల మధ్య జరుగుతున్న సంఘర్షణలో మాత్రం తాలిబన్ల మూకలకు మద్దతిస్తోంది. ఏకంగా తాలిబన్లకు మద్దతుగా ఘర్షణల్లో ప్రత్యక్షంగా పాల్గొంటోంది. ఈ ఘర్షణల్లో గాయపడిన తాలిబన్లకు తమ ఆస్పత్రుల్లోనే చికిత్స కూడా అందిస్తోంది.