ఏపీలో అధికారంలో లేని తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బందులని ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. వరుసగా ఐదేళ్లు అధికారంలో ఉండి, ఒక్కసారి అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీని, చాలామంది నాయకులు వీడిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నన్ని రోజులు బాగానే రాజకీయం చేసిన నాయకులు, ఓటమి పాలయ్యాక ఆ పార్టీని వదిలేశారు. ఇలా చాలామంది నాయకులు వైసీపీలోకి వెళ్లారు.