ఏపీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు, ప్రతిరోజూ ఏదొక అంశంపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారనే సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్నా కూడా బాబు వెనక్కి తగ్గకుండా విమర్శలు గుప్పిస్తారు. అసలు జగన్పై విమర్శలు చేయకుండా బాబుకు నిద్రపట్టదనే చెప్పొచ్చు. అలా జగన్పై ఫైర్ అయ్యి చంద్రబాబు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాత్రం చంద్రబాబు పోరాటం చేయరు. మరి బీజేపీ అంటే భయమో లేక ఎక్కడ ఏ విమర్శ చేస్తే తనకు ఇబ్బంది అవుతుందని అనుకుంటారో తెలియదుగానీ, బాబు మాత్రం మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయరు.