కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ముగ్గురేసి చొప్పున మంత్రులు జగన్ క్యాబినెట్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి జరిగే మంత్రివర్గంలో జరిగే మార్పుల్లో ఈ జిల్లాల నుంచి కనీసం ఒక్కరు చొప్పున క్యాబినెట్ నుంచి బయటకు రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో నాలుగైదు నెలల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.