రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్ట్ లతో వైసీపీలో సందడి వాతావరణం నెలకొంది. పార్టీని, జగన్ ని నమ్ముకున్నవారికి గుర్తించుకుని మరీ పదవులిచ్చారని చాలామంది సంబరపడుతున్నారు. అదే సమయంలో పదవులు రానివారు లోలోపల నొచ్చుకుంటున్నా.. తమకి కూడా అవకాశం వస్తుందని వేచి చూస్తున్నారు. ఈ దశలో వైసీపీ నామినేటెడ్ పోస్ట్ లు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపడం విశేషం. అవును, వైసీపీ పండగ, టీడీపీలో నిర్వేదాన్ని మిగిల్చింది. మరోసారి పాత రోజుల్ని గుర్తు చేసింది.