దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీలు, యూనివర్శిటీల్లో అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలుపెట్టాలని యూజీసీ సూచించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డ్ లు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తున్నాయి కాబట్టి. వాటి ద్వారా ఎంట్రన్స్ ల నిర్వహణ, ఇంటర్ ఫలితాల ఆధారంగా డిగ్రీ ప్రవేశాలు జరపాలని సూచించింది. అక్టోబర్ 1న వీలుకాకపోతే, కనీసం అక్టోబర్ 18నుంచయినా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలని సూచించింది యూజీసీ.