నారప్ప సినిమా ఓటీటీ విడుదల సందర్భంగా నిర్మాత సురేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు కలకలం రేపింది. ఏపీలో ఇప్పుడున్న టికెట్ రేట్లతో సినిమాలు ప్రదర్శించడం అసాధ్యమని చెప్పారాయన. ఏపీలో థియేటర్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయిందని అన్నారు. ఏపీ ప్రభుత్వంతో దూరం పెరిగిందని తాను చెప్పలేనని అయితే భౌతికంగా మాత్రం దూరం పెరిగిన మాట వాస్తవం అని అన్నారు సురేష్ బాబు. సినిమాకు ప్రాధాన్యం ఇవ్వాలా వద్దా అనే విషయంపై ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా వ్యవహరిస్తుందని చెప్పారు సురేష్ బాబు.