ఊహించని విధంగా భారీ స్థాయిలో సీఎం జగన్, నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసిన విషయం తెలిసిందే. అన్నీ జిల్లాలకు న్యాయం చేస్తూ, సామాజికవర్గ సమీకరణాలని బేరీజు వేసుకుని, ఎవరికి అన్యాయం చేయకుండా పదవుల పంపకాలు చేశారు. అలాగే ఈ పంపకాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా కీలక వర్గాలకు పదవులు ఇచ్చారు.