ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలో ఉన్నప్పుడే అన్నీ పరిస్తితులు బాగుంటాయి. అలాగే అందులో నాయకులు కూడా యాక్టివ్గా పనిచేస్తూ రాజకీయం చేస్తారు. అధికారంలో ఉంటే ఏదొక పదవి దక్కుతుందనే ఉద్దేశంతో ముందుకెళ్తారు. కానీ ఎప్పుడైతే అధికారం ఉండదో అప్పుడు ఆ పార్టీకి అన్నీ ఇబ్బందులే వస్తాయి. వరుస పెట్టి షాకులు తగలడం, ఆ పార్టీని నాయకులు వీడటం జరుగుతాయి.