ఎప్పుడూలేని విధంగా తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతవరకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే పార్టీ లేదని, గత ఎన్నికల్లోనే కాంగ్రెస్, బీజేపీల కథ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్కు పోటీగా రాగా, దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటడంతో, టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని విశ్లేషణలు కూడా వచ్చాయి.