కరోనా కాస్త తగ్గిందని.. అన్ని లాక్డౌన్ నిబంధనలు సడలించి కొన్ని రోజులైనా కావడం లేదు.. అప్పుడే బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని కొత్త కరోనా వేరియంట్లు చుట్టుముడుతున్నాయన్న వార్తలు భయం గొలుపుతున్నాయి. కరోనా వేరియంట్ల విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా మరణాల పెరుగుదల కూడా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.