నెలాఖరు నాటికి రైతుల బకాయిలన్నీ చెల్లిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు రూ.1600 కోట్లు.. నాబార్డు నుంచి వచ్చే రుణంతో పాటు మరో రూ.1600 కోట్లతో ఈ నెలాఖరుకు రైతులకు ప్రతి పైసాతో సహా మొత్తం చెల్లిస్తామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.