ఏపీలో సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ జులై1నుంచి ఆ ఉత్తర్వులు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే ఇప్పటి వరకు కేవలం 50శాతం సిబ్బంది మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. దీంతో సీఎంఓ కార్యాలయం సీరియస్ అయింది. ఈరోజునుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అంటూ మరోసారి ఆదేశాలిచ్చింది. హాజరు లేకపోతే జీతం కట్ అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది.