ఎల్ రమణ తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాగా తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షడిగా బక్కని నరసింహులుకు చంద్రబాబు ఈ రోజు బాధ్యతలు అప్పగించారు. ఈ సంధర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ...ఈ రోజు తెలుగుదేశం పార్టీలో తనను చంద్రబాబు నాయుడు గారు నమ్మి చాలా బాధ్యతలు అప్పగించారని అన్నారు. వారి ఆలోచనలు మేరకు తాను నడుచుకుంటూ పార్టీ బలోపేతం కోసం పాటుపడుతానని నరసింహులు వెల్లడించారు. పార్టీ మారడం అనేది ప్రస్తుత రోజుల్లో అందరికీ అలవాటు అయిందనీ కానీ నేను అలా కాదని అన్నారు...ముమ్మాటికీ తాను తెలుగుదేశం కార్యకర్తనే అని గుర్తు చేశారు.