దేశ రాజకీయాల్లో బీజేపీ గత ఎనిమిది సంవత్సరాలుగా తన హవాను కొనసాగిస్తుంటే, మరో వైపు ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ మాత్రం అధికారం కోల్పోయి కాస్త బలహీనపడిందనే చెప్పాలి. ఎంతగా బలహీనపడిందంటే ఆఖరికి కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షుడి విషయంలో సైతం బలమైన నిర్ణయం తీసుకోలేక చతికిలపడుతోంది.