కోవిడ్ ఆస్పత్రిలలో అగ్నిమాపక భద్రత నిబంధనలు వెంటనే అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం 2022 వరకు రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలంటూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలో ఉన్న కోవిడ్ ఆస్పత్రులకు అగ్నిమాపక యంత్రాలను ఏర్పరుచుకునేందుకు ఎక్కువ సమయం ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు...అంటే ఎంతో మంది ప్రజల ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారా..? అంటూ ప్రశ్నించింది.