ఏపీలో ఏ నియోజకవర్గంలోనైనా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అదేరకంగా వైసీపీ-టీడీపీల మధ్య ఫైట్ జరిగింది. అయితే నాలుగైదు నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ-జనసేనల మధ్య పోరు జరగుగా, ఆ స్థానాల్లో టీడీపీ మూడో స్థానంలో నిలిచింది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో జనసేన రెండోస్థానంలో నిలబడగా, టీడీపీ మూడోస్థానానికి పరిమితమైంది. అయితే ఇవేగాక మరో స్థానంలో టీడీపీ మూడోస్థానంలో నిలబడింది.