తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని, రేవంత్...చంద్రబాబు మనిషి అని, రేవంత్‌కు పీసీసీ రావడానికి కారణం చంద్రబాబే అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విమర్శలని రేవంత్ ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ వస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తాజాగా కోకాపేటలో ఉన్న ప్రభుత్వ భూములని కేసీఆర్ ప్రభుత్వం వేలం వేసిన విషయం తెలిసిందే.