కేంద్ర ప్రభుత్వం విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్ట్రాటజీ మారినట్లు కనిపిస్తోంది. గత రెండేళ్లుగా కేంద్రంపై మెతక వైఖరితో ముందుకెళుతున్న జగన్, ఇప్పుడు దూకుడుగా వెళ్ళడం మొదలుపెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అమలు చేయాల్సిన విభజన హామీలపై వైసీపీ ఎంపీలు గళం విప్పుతున్నారు. కేంద్రంలో రెండోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడంతో, రాష్ట్రానికి అమలు చేయాల్సిన అంశాలపై జగన్ ప్రభుత్వం పెద్దగా డిమాండ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే పని అవుతుందని చెప్పి జగన్, కేంద్రాన్ని ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే వచ్చారు.