ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు అధికారం రెండు పార్టీల మధ్యే చేతులు మారుతూ వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల మధ్య అధికారం మారుతూ వచ్చింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగవ్వడంతో, ఏపీలో వైసీపీ, టీడీపీకి పోటీగా వచ్చింది. పేరుకు వైసీపీకి కొత్త పార్టీ గానీ అందులో ఉన్న నాయకులు కాంగ్రెస్, టీడీపీలకు చెందినవారే. ఇక గత రెండు ఎన్నికలుగా అధికారం టీడీపీ-వైసీపీలు పంచుకున్నాయి.