తెలంగాణలో పేలుడు పదార్థాల కలకలం రేగింది. రాష్ట్రంలో యథేచ్చగా పేలుడు పదార్థాలు లభిస్తున్నాయని.. వీటిని మావోయిస్టుల వంటి శక్తులు వాడుకుంటున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తెలిపింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్ధాల కేసులో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ.. ఈ వివరాలు ఇప్పుడు వెల్లడించింది.