రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ మానస పుత్రికగా పేర్కొంటారు. అప్పటి వరకు అలాంటి ఆలోచన ఎవరికీ రాలేదని, సీమ సస్యశ్యామలం అవుతుందని చెబుతారు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ అనుమతుల విషయంలో ఆపసోపాలు పడుతోంది వైసీపీ ప్రభుత్వం. గతంలో కేంద్రం 5 అంశాలపై వివరణ కోరుతూ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వాయిదా వేసింది. వాటికి క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదిక తీసుకెళ్లి ఇవ్వగా.. కేంద్రం వాటిని పరిశీలించి మరోసారి బ్రేక్ లు వేసింది. ఇప్పుడు కొత్తగా 4 అంశాలను లేవనెత్తింది. వీటి సంగతి తేల్చాలని చెప్పింది.