సీఎం జగన్ తాను చేసిన వాగ్దానాలను గుర్తు చేసినా భరించే పరిస్థితి లేకుండా పోతోందని జనసేన విమర్శిస్తోంది. నిరుద్యోగ యువత కోసం వినతి పత్రం ఇస్తామంటే అరెస్టు చేస్తారా.. మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా నిలిస్తే సీఎమ్ ఇబ్బందిపడుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.