రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను అక్రమంగా అరెస్టు చేసారని వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలని మాజీ సీఎం తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన సంఘాల పోరాటానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనకు దిగితే అరెస్టు చేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి, యువజన సంఘ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు.