పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి.... ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. పేరుకే జీవనాడి, కానీ ఇందులో జీవం మాత్రం ఉన్నట్లు కనిపించడం లేదు. ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్టు సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. ఎప్పుడో పునాది పడిన ఈ పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కొంత వరకు పనులు జరిగితే, గత చంద్రబాబు ప్రభుత్వం లో పనులు కాస్త తొందరగానే కదిలాయి.