ఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ గెలవగల సత్తా ఉన్న నాయకులు వల్లభనేని వంశీ ఒకరు. తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వంశీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన వంశీ, ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గం షిఫ్ట్ అయ్యారు. మొదటినుంచి సొంత నియోజకవర్గం గన్నవరంలో పోటీ చేయాలని వంశీ అనుకుంటున్నారు.