రాష్ట్రంలో అధికార వైసిపికి బలం ఎక్కడ తగ్గినట్లు కనిపించడం లేదని గట్టిగా చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఎలాగైతే భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిందో, ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలో వైసీపీ అదే బలంతో ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ ఇమేజ్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు... వీటి వల్ల ఇంకా వైసీపీ బలం తగ్గలేదు. అదేసమయంలో ప్రతిపక్ష టీడీపీ ఇంకా వీక్ అవుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో టిడిపి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నట్లు కనిపిస్తుంది.