ఏపీలో జనసేన పార్టీ చాలా పరిమితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద బలం లేదని గత ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఆఖరికి పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం బట్టి చూస్తే జనసేనకి రాష్ట్రస్థాయిలో స్ట్రాంగ్ గా లేదని అర్థమైపోయింది. పోనీ ఓడిపోయాక కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చు అనుకోవచ్చు.